మంచేరియల్, 3 September
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గర్మిళ్ల ప్రాంతంలో బైక్పై వెళ్తున్న మల్లేష్ అనే వ్యక్తికి ఆకస్మికంగా గుండెనొప్పి రావడంతో కుప్పకూలిపోయారు. అదే సమయంలో వెనుక కారులో వస్తున్న వైద్య దంపతులు డాక్టర్ ఎగ్గన శ్రీనివాస్, డాక్టర్ సునీత వెంటనే స్పందించి సీపీఆర్ చేసి ఆయన ప్రాణాలను కాపాడారు.
సీపీఆర్తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 12వ డివిజన్ పరిధిలోని గర్మిళ్ల ప్రాంతంలో మల్లేష్ అనే వ్యక్తి బైక్పై వెళ్తుండగా ఆకస్మికంగా గుండెనొప్పి రావడంతో కుప్పకూలిపోయారు. అదే సమయంలో ఆయన వెనుక కారులో వస్తున్న వైద్య దంపతులు డాక్టర్ ఎగ్గన శ్రీనివాస్, డాక్టర్ సునీత గార్లు వెంటనే స్పందించి సీపీఆర్ చేసి మల్లేష్ ప్రాణాలను కాపాడారు. సకాలంలో స్పందించి నిండు ప్రాణాన్ని నిలబెట్టిన వైద్య దంపతుల మానవత్వం అందరి ప్రశంసలు అందుకుంది. అత్యవసర పరిస్థితుల్లో సీపీఆర్ ఎంత కీలకమో సమాజానికి తెలియజేసిన సంఘటనగా ఇది నిలిచింది. ఈ సందర్భంగా వైద్య దంపతులను బీజేపీ కార్పొరేటర్లు ముఖేష్ గౌడ్, కస్తూరి నాగరాజు, బోట్ల అనిత–సత్యం అభినందించి ఘనంగా సత్కరించారు.












