Mancherial/Jaipur (ప్రజావార్త) జూలై 13
జైపూర్ మండలంలోని ఇందారం గ్రామ అంగన్వాడీ కేంద్రంలో సోమవారం జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సర్పంచ్, ఉపసర్పంచ్ పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేశారు.
జైపూర్ మండలంలోని ఇందారం గ్రామ అంగన్వాడీ కేంద్రంలో సోమవారం జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని నిర్వహించారు. సర్పంచ్ మహమ్మద్ ఫయాజ్, ఉపసర్పంచ్ ఎల్కటూరి శివ పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలను స్వయంగా పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ నులిపురుగుల నివారణ మాత్రల వల్ల పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుందని, పోషకాహార లోపం తగ్గుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ కళ్యాణి, ఏఎన్ఎం కృష్ణవేణి, హెచ్.వి భారతి, ఆశ కార్యకర్తలు పద్మ, భాగ్య పాల్గొన్నారు.











