మంచేరియల్, 2026-07-30
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్యం తమ ప్రధాన్యత అని తెలిపారు. అత్యవసర వైద్య సేవలు అందించడానికి 24 గంటలూ అందుబాటులో ఉండేలా కమాండ్ కంట్రోల్ రూమ్, హెల్ప్ లైన్ నంబర్‌ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
జిల్లాలో ప్రజల ఆరోగ్యం తమ ప్రధాన్యత అని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో వైద్య సేవలు అందించడానికి, జిల్లాలోని ఏ ప్రాంతంలోనైనా వైద్య ఆరోగ్యంపై అత్యవసర సేవలు అందించడానికి 24 గంటలూ అందుబాటులో ఉండేలా కమాండ్ కంట్రోల్ రూమ్, హెల్ప్ లైన్ నంబర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఆరోగ్యపరమైన, అత్యవసర సమస్యల కోసం ఈ నంబర్‌ను సంప్రదించవచ్చని, ముఖ్యంగా ప్రజా ఆరోగ్యం, వ్యాధులు ప్రబలినప్పుడు ఈ వైద్య సేవలను ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ నినాదంతోనే ఈ సేవలను ప్రారంభించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉప జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుధాకర్ నాయక్, వైద్య ఆరోగ్యశాఖ సంచాలకులు విశ్వేశ్వర్ రెడ్డి, ఎపిటిమల లిస్ట్ సుమన్, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, సిహెచ్ఓ కాకినాడ వెంకటేశ్వర్లు, వైద్య సిబ్బంది నీలిమ, సురేందర్, రవి కిరణ్, రాజేష్, వసుమతి పాల్గొన్నారు.












