మంచేరియల్, 2026-07-02
డాక్టర్స్ డే సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ రామకృష్ణపూర్ ఆధ్వర్యంలో చెన్నూర్ నియోజకవర్గ నాయకులు డాక్టర్ రాజా రమేష్, క్యాతనపల్లి మున్సిపాలిటీ చైర్ పర్సన్ డాక్టర్ సంధ్యారాణి దంపతులను ఘనంగా సన్మానించారు. సమాజానికి వారు అందిస్తున్న విశిష్ట వైద్య సేవలను కొనియాడుతూ లయన్స్ క్లబ్ సభ్యులు వారిని సత్కరించారు.
డాక్టర్స్ డే సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ రామకృష్ణపూర్ ఆధ్వర్యంలో చెన్నూర్ నియోజకవర్గ నాయకులు డాక్టర్ రాజా రమేష్, క్యాతనపల్లి మున్సిపాలిటీ చైర్ పర్సన్ డాక్టర్ సంధ్యారాణి దంపతులను ఘనంగా సన్మానించారు.
సమాజానికి వారు అందిస్తున్న విశిష్ట వైద్య సేవలను కొనియాడుతూ లయన్స్ క్లబ్ సభ్యులు శాలువా కప్పి, పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు ప్రెసిడెంట్ లయన్ నులుగొండ సత్యం, సెక్రటరీ లయన్ ఎ. సత్యనారాయణ, కోశాధికారి లయన్ పిల్లి సతీష్, కోర్ కమిటీ (స్పోర్ట్స్) మెంబర్ లయన్ కంబగోని సుదర్శన్ గౌడ్, డీసీ లయన్ వేముల వెంకటేశం, పీపీ లయన్ వనం సత్యనారాయణ, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రామిడి కుమార్, యూత్ నాయకులు మణి కుమార్ తదితరులు పాల్గొని డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు.












