జైపూర్, 21.07.2026
సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో బొగ్గు మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు మెగా ప్లాంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. సింగరేణి డైరెక్టర్ (ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్) గారి మార్గదర్శకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో డైరెక్టర్ (పిపి) శ్రీ కె. వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ప్రభుత్వ రంగ సంస్థ) కమ్యూనికేషన్ సెల్, ఎస్టిపిపి ఏరియా ఆధ్వర్యంలో సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో మెగా ప్లాంటేషన్ ప్రోగ్రాం నిర్వహించబడింది. బొగ్గు మంత్రిత్వ శాఖ మరియు దాని అనుబంధ సంస్థ కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ ఆదేశాల మేరకు, సింగరేణి డైరెక్టర్ (ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్) గారి దిశా నిర్దేశంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డైరెక్టర్ (పిపి) శ్రీ కె. వెంకటేశ్వర్లు గారు హాజరయ్యారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ శ్రీ కె. వెంకటేశ్వర్లు గారు మాట్లాడుతూ, సింగరేణి సంస్థ భూమి నుండి బొగ్గు తీయడమే కాకుండా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ దేశ, రాష్ట్ర అవసరాలకు బొగ్గు, విద్యుత్ సరఫరా చేస్తూ అభివృద్ధికి తోడ్పడుతుందని తెలిపారు. పర్యావరణానికి బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాల వల్ల జరిగే నష్టాన్ని తగ్గించడం కోసం, పర్యావరణహిత చర్యగా ఏటా సింగరేణి సంస్థ తమ పని ప్రదేశాలలో మొక్కలు నాటే కార్యక్రమాలను నిర్వహిస్తున్నదని తెలిపారు. దీనిలో భాగంగానే మెగా ప్లాంటేషన్ ప్రోగ్రాం నిర్వహించబడిందని, దీని ద్వారా పర్యావరణం సమతుల్యం అవుతుందని అన్నారు.
అనంతరం డైరెక్టర్, వివిధ అధికారులు, ఉద్యోగులు పెద్ద మొత్తంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ప్లాంటు ఈడి శ్రీ సిహెచ్ చిరంజీవి, జీఎం ఎస్టిపిపి శ్రీ ఎం నరసింహ రావు, జీఎం(పిసిఎస్) శ్రీ మదన్ మోహన్, ఏజిఎం (ఈ & ఎం) శ్రీ సూర్యనారాయణ రాజు, ఏజిఎం(ఓ&ఎం) శ్రీ వివి సుధాకర్ రెడ్డి, ఏజిఎం (ఫైనాన్సు) శ్రీ బి శ్రీధర్, ఏఐటియుసి ఫిట్ సెక్రటరీ శ్రీ సత్యనారాయణ, సిఎంఓఎఐ బ్రాంచ్ ప్రెసిడెంట్ శ్రీ డి పంతులా, 1x800MW ప్లాంట్ కోఆర్డినేటర్ శ్రీ ఎం.వి. వేణుగోపాల్, డిజీఎం (ఎన్విరాన్మెంట్) శ్రీ వాసుదేవ మూర్తి, పర్సనల్ విభాగాధిపతి శ్రీ ఎస్వి రాజేశ్వర్ రావు, మేనేజర్ ఫారెస్ట్ శ్రీమతి చంద్రమణి, ఇతర అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
ఇట్లు, STPP అధికార ప్రతినిధి.












