మంచేరియల్, 10 September
విద్యార్థులకు క్రమశిక్షణ అత్యంత ఆవశ్యకమని, క్రమశిక్షణ లేనివారు దారం తెగిన గాలిపటంతో సమానమని రాఘవేంద్ర గ్రూప్స్ చైర్మన్ ఎర్ర చంద్రశేఖర్ అన్నారు. గురువారం జ్యోతి గార్డెన్ లో జరిగిన రాఘవేంద్ర కరిమల జూనియర్ కళాశాల విద్యార్థిని విద్యార్థుల ఫ్రెషర్స్ డే వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు.
*విద్యార్థులకు క్రమశిక్షణ ఎంతో అవసరం : రాఘవేంద్ర గ్రూప్స్ చైర్మన్ ఎర్ర చంద్ర శేఖర్* విద్యార్థులకు క్రమశిక్షణ ఎంతో అవసరమని, క్రమశిక్షణ లేని వారు దారం తెగిన గాలిపటం తో సమానమని రాఘవేంద్ర గ్రూప్స్ చైర్మన్ ఎర్ర చంద్రశేఖర్ అన్నారు. గురువారం జ్యోతి గార్డెన్ లో జరిగిన రాఘవేంద్ర కరిమల జూనియర్ కళాశాల జూనియర్ విద్యార్థిని విద్యార్థుల ఫ్రెషర్స్ డే వేడుకల్లో ఎర్ర చంద్ర శేఖర్ పాల్గొని విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి కష్టమైన ఇష్టంతో చదివితే ఉన్నత శిఖరాలకు ఎదగడానికి అవకాశం ఉంటుందని, యువకులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. మొదటి సంవత్సరం విద్యార్థిని విద్యార్థులకు ద్వితీయ సంవత్సర విద్యార్థులు హృదయపూర్వక స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో రాఘవేంద్ర గ్రూప్స్ ఫౌండర్ ఎర్ర ప్రమీల, రాఘవేంద్ర విద్యాసంస్థల కరస్పాండెంట్ ఎర్ర సంపత్, రాఘవేంద్ర విద్యాసంస్థల డీన్ హేమలత షిండే, కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మణ్, రాఘవేంద్ర లిటిల్ హన్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాస్, శీల శ్రవణ్, అధ్యాపక బృందం పాల్గొన్నారు.












