మంచేరియల్, 2026-08-11
ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేసి విద్యార్థులకు సకల సదుపాయాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం ఆయన హాజీపూర్ మండలంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించారు.
ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేసి విద్యార్థులకు సకల సదుపాయాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం జిల్లాలోని హాజీపూర్ మండల కేంద్రంలో గల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా అదనపు గదులు, భోజనశాల నిర్మాణ పథకం, వంటశాల, రిజిస్టర్లు, పారిశుద్ధ్య నిర్వహణ వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
నిర్మాణ పనులు వేగవంతం చేయాలి
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసే చర్యలలో భాగంగా చేపట్టిన అదనపు గదులు, భోజనశాల నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం సకాలంలో పోషక విలువలతో కూడిన ఆహారం, శుద్ధమైన త్రాగునీటిని అందించాలని, విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు.
పరిశుభ్రతపై అవగాహన
వర్షాకాలం దృష్ట్యా పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని, వ్యక్తిగత పరిశుభ్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం ముల్కల్ల లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలను కూడా ఆయన సందర్శించారు.
సదుపాయాల కల్పన
ఈ పాఠశాలల్లో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన సదుపాయాలు కల్పించాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ విద్యా సంస్థలలో విద్యార్థుల సంఖ్యను పెంచాలని, తరగతిలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు.
విద్యార్థులతో ముఖాముఖి
పాఠశాలలో విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, మధ్యాహ్న భోజనం నాణ్యత, బోధన వంటి అంశాలపై విద్యార్థులతో నేరుగా మాట్లాడుతూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.












