గోదావరిఖని, 2026-08-11
రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలోని గోదావరిఖని అశోక్‌నగర్ జెడ్పీహెచ్ఎస్ హైస్కూల్ విద్యార్థులకు మహిళలు, బాలల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించారు. పెద్దపల్లి షీ టీమ్ ఆధ్వర్యంలో ఈ అవగాహన సదస్సును నిర్వహించారు. పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరిగింది.

అవగాహన కల్పించిన షీ టీమ్
ఈ సందర్భంగా షీ టీమ్ ఇన్చార్జి ఎస్ఐ లావణ్య విద్యార్థులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్, పోక్సో చట్టం, సోషల్ మీడియా వినియోగం, సైబర్ మోసాలు, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వేధింపులకు గురైతే భయపడకుండా షీ టీమ్ 6303923700కు సమాచారం అందించాలని సూచించారు.
అత్యవసర సేవలు
అత్యవసర పరిస్థితుల్లో 100/112 నంబర్లకు, సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలని తెలిపారు. మహిళలు ప్రయాణ సమయంలో భద్రత కోసం - యాప్‌ను వినియోగించుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో హెడ్మాస్టర్ మల్లేష్, ఉపాధ్యాయులు, షీ టీమ్ సభ్యులు సురేష్, మౌనిక, స్నేహలత తదితరులు పాల్గొన్నారు.