జిల్లాలోని బెల్లంపల్లి మండలంలో గల తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల, బాలుర గురుకుల పాఠశాలలను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంగళవారం సందర్శించారు. విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ బెల్లంపల్లిలోని గురుకుల పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులు, వంటశాలలు, మెనూ అమలు, పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని సూచించారు.
ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేస్తోందని, ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. త్రాగునీరు, విద్యుత్, మూత్రశాలలు, మెనూ అమలు వంటి సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు.
విద్యార్థులకు మెనూ ప్రకారం సకాలంలో పౌష్టికాహారం అందించాలని, శుద్ధమైన త్రాగునీటిని అందుబాటులో ఉంచాలని, నాణ్యమైన విద్యను బోధించాలని కలెక్టర్ సూచించారు. వంటశాలల్లో శుభ్రతా నిబంధనలు పాటించాలని, తాజా కూరగాయలు, నాణ్యమైన నిత్యవసర వస్తువులను వినియోగించాలని ఆదేశించారు.
బాలికల గురుకుల పాఠశాలలో నిర్మాణంలో ఉన్న మూత్రశాలల పనులను వేగవంతం చేయాలని, విద్యార్థుల చిత్రలేఖనాన్ని పరిశీలించి వారి నైపుణ్యతను అభినందించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.







