మంచేరియల్, 2026-07-29
స్థానిక సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు, పాలాభిషేకం, అన్నదాన కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. 7వ డివిజన్ కార్పొరేటర్ ఏల్పుల రవీందర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మేయర్ ధరణి మధుకర్, నూకల రమేష్ ముఖ్య అతిథులుగా పాల్గొని, అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
స్థానిక సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు, పాలాభిషేకం, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. 7వ డివిజన్ కార్పొరేటర్ ఏల్పుల రవీందర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మేయర్ ధరణి మధుకర్, నూకల రమేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఆలయ అయ్యగారు వెంకటరమణచార్యులు 108 కలశాలతో బాబాకు పాలాభిషేకం చేసి, భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. గురు పౌర్ణమి సందర్భంగా గురువులను, గురువుతో సమానమైన భగవంతులను పూజించడం ఎంతో ముఖ్యమని ఈ సందర్భంగా వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. 7వ డివిజన్ అధ్యక్షులు చిలుక మల్లేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిలుముల రాయమల్లు, పొట్లచెర్ల రాములు, గండు మల్లయ్య, మహిళా నాయకురాళ్లు కొప్పర్తి రాజేశ్వరి, తాండ్ర శారద, ఆకుదారి జ్యోతి, మాచర్ల మౌనిక, యూత్ సభ్యులు కాదశి, హేమంత్ తదితరులు పాల్గొన్నారు.











