మంచేరియల్, 2026-07-03
మంచిర్యాల పట్టణం కట్ట పోచమ్మ వద్ద కొలువై ఉన్న పెద్దమ్మ తల్లి ఆలయంలో 4వ వార్షికోత్సవ వేడుకలు ముదిరాజ్ కుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చండీ హోమం, ప్రత్యేక అభిషేకం, మహానివేదన, అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు.
హమాలివాడ కట్ట పోచమ్మ వద్ద కొలువై ఉన్న పెద్దమ్మ తల్లి ఆలయంలో 4వ వార్షికోత్సవ వేడుకలు ముదిరాజ్ కుల బంధువులు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.
మంచిర్యాల పట్టణ ముదిరాజ్ కుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో చండీ హోమం, ప్రత్యేక అభిషేకం, అమ్మవారికి మహానివేదన అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు.
ఈ వైదిక కార్యక్రమాలను ప్రముఖ వేద పండితులు శ్రీ కార్తీక్ శర్మ గారు వేదమంత్రోచ్ఛారణల మధ్య నిర్వహించారు.
ఈ వేడుకలో ముదిరాజ్ ఆలయ కమిటీ సభ్యులు, కుల బంధువులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. చివరగా భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
ఇట్లు, ముదిరాజ్ కుల సంఘం ఆలయ కమిటీ, మంచిర్యాల.











