మంచేరియల్, 2026-07-28
రేపు జరగనున్న గురుపౌర్ణమి పండుగ సందర్భంగా, ఈ రోజు సాయి బాబాను పురవీధుల్లో మహిళలు కోలాటాలు వేస్తూ భక్తిశ్రద్ధలతో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు.
రేపు జరిగే గురుపౌర్ణమి సందర్భంగా, ఈ రోజు బాబాను పురవీధుల గుండా మహిళలు కోలాటాలతో భక్తిశ్రద్ధలతో ఊరేగించారు.
ఈ కార్యక్రమంలో భక్తులతో పాటు 7వ డివిజన్ కార్పొరేటర్ వేల్పుల రవీందర్, 7వ డివిజన్ అధ్యక్షుడు చిలుక మల్లేశ్, సాయి బాబా టెంపుల్ మాజీ చైర్మన్ పొట్లచర్ల రాములు, చిలుముల రాయమల్లు, గండు మల్లయ్య, గజ్జెల పోచం, మహిళా నాయకురాలు కొప్పర్తి రాజేశ్వరి, తాండ్ర శారద, ఆకుదరి జ్యోతి, యూత్ నాయకులు కాదాసి నితీష్, హేమంత్, అయ్యగారు వెంకటాచార్యులు, భాను వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.












