మంచిర్యాలలోని గాయత్రి మాత కాలనీ, పాత గర్మిళ్లలో శ్రీ గాయత్రి మాత గణేష్ మండలి ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం స్వామివారికి 108 రకాల ప్రసాదాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీ గాయత్రి మాత కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి, స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో శ్రీ గాయత్రి మాత గణేష్ మండలి అధ్యక్షులు శ్రీరాంభట్ల విజయకుమార్, ప్రధాన కార్యదర్శి తాటికొండ మల్లేష్, కోశాధికారి అబ్బోజు సుదర్శన చారి, కమిటీ సభ్యులు, కాలనీవాసులు, మహిళలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.
నవరాత్రి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. కాలనీవాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.


