మంచేరియల్, 25-06-2026
సింగరేణి సివిల్ కార్యాలయానికి చెందిన సుమారు రూ.4,40,000 విలువైన 110 ఐరన్ పైపులను అక్రమంగా తరలిస్తున్న కేసులో సింగరేణి సివిల్ సూపర్వైజర్, స్క్రాప్ వ్యాపారితో సహా ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
తేదీ 25-06-2026న సింగరేణి సివిల్ కార్యాలయానికి చెందిన సుమారు రూ.4,40,000 విలువ గల 110 ఐరన్ పైపులను ఎటువంటి అనుమతులు లేకుండా వాహనంలో లోడ్ చేసి తరలిస్తున్నారనే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జెట్టి నాగమల్లేశ్వరరావు, తండ్రి సీతారామస్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది.
దర్యాప్తులో భాగంగా, సింగరేణి సివిల్ సూపర్వైజర్ గంగళ్ల సందీప్, తనకు పరిచయం ఉన్న స్క్రాప్ వ్యాపారులతో కుమ్మక్కై, ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండానే ఐరన్ పైపులను వాహనంలో లోడ్ చేసి అక్రమంగా తరలించినట్లు గుర్తించారు. ఈ సందర్భంగా ఐరన్ పైపులతో పాటు వాటిని తరలిస్తున్న డీసీఎం వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
1. గంగళ్ల సందీప్, తండ్రి జగేశ్వరరావు, వయస్సు 37 సంవత్సరాలు, సింగరేణి సివిల్ సూపర్వైజర్, నివాసం: శ్రీరాంపూర్. 2. ముప్పు రాజు, తండ్రి సారయ్య, వయస్సు 37 సంవత్సరాలు, ప్రైవేట్ సివిల్ ఆఫీస్ ఉద్యోగి, నివాసం: నస్పూర్. 3. మహమ్మద్ హకీమ్, తండ్రి ఖదీర్, డీసీఎం వాహన డ్రైవర్, నివాసం: మంచిర్యాల. 4. తూర్పటి జంపయ్య, తండ్రి మొండయ్య, వయస్సు 41 సంవత్సరాలు, నివాసం: నస్పూర్. 5. చింతల సమ్మయ్య, తండ్రి ఉప్పలయ్య, వయస్సు 31 సంవత్సరాలు, నివాసం: శ్రీరాంపూర్ గ్రామం. 6. బతినీ నరేష్ గౌడ్, తండ్రి దశరథం, వయస్సు 42 సంవత్సరాలు, స్క్రాప్ వ్యాపారి, నివాసం: మంచిర్యాల.
కేసు దర్యాప్తు అనంతరం నిందితులను విచారించి న్యాయస్థానంలో హాజరుపరచగా, న్యాయస్థానం వారికి రిమాండ్ విధించింది. అనంతరం వారిని జైలుకు తరలించినట్లు శ్రీరాంపూర్ ఇన్స్పెక్టర్ అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు.












