మంచేరియల్, 2026-07-13
ప్రేమ పేరుతో వేధింపులకు గురైన యువతి పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన మంచిర్యాల జిల్లా టేకుమట్ల గ్రామంలో చోటుచేసుకుంది. గోశిక మాధవి (26) అనే యువతి ఈ దారుణానికి పాల్పడింది. భూపాలపల్లి జిల్లాలో సింగరేణి ఉద్యోగం చేస్తున్న గోనే వెంకటేష్ తనను వేధిస్తున్నాడని మాధవి బంధువులు ఆరోపించారు.
ప్రేమ పేరుతో వేధింపులకు గురైన యువతి పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన మంచిర్యాల జిల్లా టేకుమట్ల గ్రామంలో చోటుచేసుకుంది. గోశిక మాధవి (26) అనే యువతి ఈ దారుణానికి పాల్పడింది.
భూపాలపల్లి జిల్లాలో సింగరేణి ఉద్యోగం చేస్తున్న గోనే వెంకటేష్ తనను వేధిస్తున్నాడని మాధవి బంధువులు ఆరోపించారు. తీవ్ర మనస్థాపానికి గురైన మాధవి పురుగుమందు సేవించడంతో, వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.
మాధవి మృతి వార్త తెలియడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ధర్నా చేపట్టారు. నిందితుడు గోనే వెంకటేష్ పై వెంటనే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. ఈ ఘటనతో టేకుమట్ల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.












