మంచేరియల్, 2026-06-27
కుటుంబ సమస్యల కారణంగా మనస్తాపానికి గురైన మంచిర్యాల పట్టణానికి చెందిన జంపకం పోషమల్లు (56) అనే వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం.
మంచిర్యాల పట్టణంలోని ఎన్టీఆర్ నగర్లో జంపకం పోషమల్లు (56) అనే వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సమస్యల కారణంగా కొడుకు, కోడలి మధ్య జరుగుతున్న గొడవలను సర్దిచెప్పే ప్రయత్నం విఫలమవడంతో మానసికంగా కృంగిపోయిన పోషమల్లు, ఇంట్లో ఎవరూ లేని సమయంలో మధ్యాహ్నం 02:30 గంటల ప్రాంతంలో ఆత్మహత్యకు పాల్పడినట్లు అతని కొడుకు జంపకం మహేందర్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ ప్రమోదరావు తెలిపారు.












