మంచేరియల్, 09-07-26
మందమర్రి పట్టణంలోని దొరల బంగ్లా ఏరియాలో గుడుంబా అమ్మకాలు యథేచ్ఛగా సాగుతున్నాయని, వాటిని వెంటనే అరికట్టాలని బస్తీవాసులు డిమాండ్ చేశారు. గత 25 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ అమ్మకాలపై చర్యలు తీసుకోవాలని, లేదంటే యువత కూడా వ్యసనాలకు బానిసై ప్రాణనష్టాలు సంభవించే ప్రమాదం ఉందని వారు హెచ్చరించారు.
మందమర్రి పట్టణంలోని దొరల బంగ్లా ఏరియాలో గుడుంబా అమ్మకాలు యథేచ్ఛగా సాగుతున్నాయని, వాటిని వెంటనే అరికట్టాలని బస్తీవాసులు డిమాండ్ చేశారు. గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో గొర్రె రామచందర్, కనకం రవీందర్, బచ్చలి సురేందర్, బత్తుల సరిత మాట్లాడుతూ గత 25 ఏళ్లుగా ఈ ప్రాంతంలో గుడుంబా అమ్మకాలు కొనసాగుతున్నాయని, వాటిని ప్రోత్సహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
గత రెండేళ్లలో గుడుంబా వ్యసనంతో 15 మంది ప్రాణాలు కోల్పోయారని, కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే యువత కూడా వ్యసనాలకు బానిసై మరిన్ని ప్రాణనష్టాలు సంభవించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇప్పటికైనా ఆబ్కారీ శాఖ స్పందించి దాడులు నిర్వహించి గుడుంబా అమ్మకాలను పూర్తిగా నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో సంపత్, వెంకటేశ్వర్లు, బాసాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.












