మంచేరియల్, 08.07.26
రామగుండము పోలీస్ కమీషనరేట్ పరిధిలో దేవాలయాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఒక నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 900 గ్రాముల వెండి వస్తువులు, 65,000 రూపాయల నగదు, ఒక VIVO మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. దొంగతనం కేసును త్వరితగతిన ఛేదించి, నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన అధికారులను ఏసీపీ అభినందించారు.
రామగుండము పోలీస్ కమీషనరేట్ పరిధిలో దేవాలయాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఒక నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 900 గ్రాముల వెండి వస్తువులు, 65,000 రూపాయల నగదు, ఒక VIVO మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు.
నేరస్థుని వివరాలు: రౌతు పవన్ (26), తండ్రి: నగేష్, కులం: మున్నూరుకాపు, వృత్తి: కూలీ, నివాసం: దుబ్బగూడెం, మహాదేవపూర్ మండలం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా.
కేసు వివరాల ప్రకారం, తేది 05.07.26 నాడు గుర్తు తెలియని దొంగలు మంచిర్యాలలోని విశ్వనాధ ఆలయంలోకి ప్రవేశించి, ఆఫీస్ రూమ్ లోని బీరువా పగలగొట్టి అందులో ఉన్న 65,000 రూపాయల నగదు, 900 గ్రాముల వెండి వస్తువులు, ఒక మొబైల్ ఫోన్ దొంగిలించారు. ఈ ఘటనపై తేది 06.07.26 న ఎండోమెంట్ శాఖ జూనియర్ అసిస్టెంట్ ఠాకూర్ ప్రతాప్ సింగ్ మంచిర్యాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, సీపీ ఆదేశాల మేరకు డీసీపీ పర్యవేక్షణలో, ఏసీపీ, మంచిర్యాల సీఐ ఆధ్వర్యంలో బృందాలను ఏర్పాటు చేశారు.
సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి దొంగను పట్టుకొని విచారించగా, అతను తన నేరాన్ని ఒప్పుకున్నాడు. దొంగిలించిన వస్తువులను అప్పగించాడు. అంతేకాకుండా, తేది 02.07.26 నాడు బైపాస్ రోడ్డులోని శివాలయంలో కూడా దొంగతనం చేసినట్లు, అలాగే గతంలో దేవాలయాలు మరియు ఇళ్లలో పలు ప్రాంతాలలో చేసిన దొంగతనాలను కూడా ఒప్పుకున్నాడు. అతనిపై గతంలో కరీంనగర్ లో వివిధ పోలీస్ స్టేషన్లలో 17 కేసులు నమోదైనట్లు వివరాలు వెల్లడయ్యాయి. 2015 నుండి 2024 వరకు కరీంనగర్ లోని వివిధ పోలీస్ స్టేషన్లలో 13 కేసులు, మరియు ఇటీవల మంచిర్యాల, కుర్మపల్లి-హన్మకొండ, ఇంతుర్తి, అక్కన్నపేట, హుస్నాబాద్ పోలీస్ స్టేషన్లలో 2026లో నమోదైన 7 కేసులు కూడా అతనిపై ఉన్నట్లు సమాచారం.
కేసును త్వరితగతిన ఛేదించి, నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన మంచిర్యాల ఇన్స్పెక్టర్ ఎస్.ప్రమోద్ రావు, ఎస్ఐ మధుసూదన్, క్రైమ్ సిబ్బంది ఉపేందర్, మహేష్, లక్ష్మణ్, తిరుపతిలను ఏసీపీ అభినందించారు.











