మంచిర్యాల వాసవిక్లబ్స్ ఆధ్వర్యంలో వేసవి తాపాన్ని తగ్గించేందుకు గత 76 రోజులుగా నిరంతరాయంగా మంచినీరు, మజ్జిగ, అంబలి పంపిణీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సేవా కార్యక్రమాలు నిరుపేదలకు, రోడ్లపై తిరిగే ప్రజలకు, ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే వారికి చేయూతనిస్తున్నాయి.
స్థానిక ఐబి చౌరస్తాలో ఉదయం నుండి సాయంత్రం వరకు చల్లని మంచినీరు, మజ్జిగ పంపిణీ జరుగుతోంది. దాతల సహకారంతో, ప్రోగ్రాం ఛైర్మన్ పడకంటి శ్రీనివాస్ నేతృత్వంలో ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. గత పదిహేను రోజులుగా అంబలిని కూడా పంపిణీ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం వేసవి కాలంలో సుమారు మూడు నెలల పాటు వాసవిక్లబ్స్ ఈ తరహా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
ఈ ఏడాది మంచిర్యాల పట్టణంలో ఏడు చోట్ల ఉచిత చల్లని మినరల్ వాటర్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఐబి చౌరస్తాలో మంచినీటితో పాటు మజ్జిగ, అంబలి, పెరుగన్నం కూడా పంపిణీ చేస్తున్నారు. సేవా కార్యక్రమాలతో పాటు, వాసవిక్లబ్స్ ప్రతి నెల అమావాస్య సందర్భంగా అన్నదానం, పౌర్ణమి రోజున సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహిస్తోంది.
ఈ నెల అధికమాసం సందర్భంగా గోదావరి నది తీరంలోని గౌతమేశ్వర ఆలయంలో సామూహిక షష్టిపూర్తి మహోత్సవాన్ని కూడా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సేవా కార్యక్రమాలలో వాసవిక్లబ్ జిల్లా గవర్నర్ పుల్లూరి బాలమోహన్, క్యాబినెట్ సెక్రటరి సేవ కేశెట్టి వంశీకృష్ణ, ట్రెజరర్ కొంకుముట్టి వెంకటేశ్, పిఆర్ది వుత్తూరి రమేష్, జోన్ ఛైర్మన్ పడకంటి శ్రీనివాస్, వాసవిక్లబ్ అధ్యక్షుడు వెనిశెట్టి రాఘవేంద్ర, కార్యదర్శ గుండా మనోహర్, కోశాధికారి బండ శ్రీనివాస్, వనితాక్లబ్ కార్యదర్శి వెనిశెట్టి దివ్య, వేంపల్లి వనితాక్లబ్ అధ్యక్షురాలు పడకంటి రజిత, కార్యదర్శి కుకుడపు గాయత్రి, కోశాధికారి పుల్లూరి మాన్విక, నస్పూర్ మండల్ వాసవిక్లబ్ అధ్యక్షుడు నకిరెకొమ్ముల రాజేంద్రప్రసాద్, కార్యదర్శి తోట రాజయ్య, యూత్ క్లబ్ అధ్యక్షుడు ముక్తా విశ్వాస్, కార్యదర్శి బోనగిరి ప్రసన్న, కోశాధికారి గందెశ్రీ అనీలకుమార్ తదితరులు పాల్గొన్నారు.












