మంచేరియల్, 2026-08-01
మంచిర్యాల జిల్లాలో జిల్లా పంచాయతీ అధికారిగా పనిచేసి పదవీ విరమణ పొందిన శ్రీ దొంతినేని వెంకటేశ్వరరావు, శ్యామల గార్ల దంపతులను టీఎన్జీవో మంచిర్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీ కుమార్ దీపక్ ఐఏఎస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మంచిర్యాల జిల్లాలో జిల్లా పంచాయతీ అధికారిగా విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన శ్రీ దొంతినేని వెంకటేశ్వరరావు, శ్యామల గార్ల దంపతులను టీఎన్జీవో మంచిర్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు శ్రీ గడియారం శ్రీహరి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ శ్రీ కుమార్ దీపక్ ఐఏఎస్ ముఖ్య అతిథిగా విచ్చేసి, దంపతులకు సన్మానం చేసి, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు శ్రీ గడియారం శ్రీహరి మాట్లాడుతూ, శ్రీ వెంకటేశ్వరరావు జిల్లా పంచాయతీ అధికారిగా సమర్థవంతంగా విధులు నిర్వహించారని, ప్రతి ఎన్నికల విజయంలో ఆయన పాత్ర కీలకమైనదని కొనియాడారు. వారి భావి జీవితం ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు కొనసాగాలని ఆకాంక్షించారు.
ఈ సన్మాన కార్యక్రమంలో టీఎన్జీవో మంచిర్యాల జిల్లా కార్యదర్శి శ్రీ బొడ్డు శ్రావణ్ కుమార్, కేంద్ర సంఘం కార్యదర్శి శ్రీ పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షులు శ్రీ శ్రీపతి బాపురావు, కోశాధికారి శ్రీ సతీష్ కుమార్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్, తిరుపతి, రాంకుమార్, శివ ప్రసాద్, నరేందర్, కేజియా రాణి, సంయుక్త కార్యదర్శులు సునీత, పద్మ లత, ప్రభు, మంచిర్యాల యూనిట్ అధ్యక్షులు నాగుల గోపాల్, కార్యదర్శి అజయ్, బెల్లంపల్లి యూనిట్ అధ్యక్షులు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.












