రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో 36 సంవత్సరాలుగా హోంగార్డ్‌గా సేవలందించి, ఉద్యోగ విరమణ పొందిన ఎం.డి.షరీఫుద్దీన్‌కు ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం జరిగింది.
గోదావరిఖని సబ్ యూనిట్లో విధులు నిర్వహించిన హోంగార్డ్ ఎం.డి.షరీఫుద్దీన్ (నంబర్-241) ఇటీవల ఉద్యోగ విరమణ పొందారు. ఈ సందర్భంగా అదనపు డీసీపీ (అడ్మిన్) కార్యాలయంలో ఆయనకు సన్మానం చేశారు.
అదనపు డీసీపీ (అడ్మిన్) కె. శ్రీనివాస్ గారు ఎం.డి.షరీఫుద్దీన్‌ను పూలమాలతో సత్కరించి, శాలువా కప్పి గౌరవించారు. ఆయన సేవలను ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేంద్ర గౌడ్, హోంగార్డ్స్ ఆర్ఐ పెద్దన్న, ఆర్ఐ (అడ్మిన్) శేఖర్, ఆర్ఐ మల్లేశం (ఎంటిఓ) తదితరులు పాల్గొన్నారు. షరీఫుద్దీన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.












