నస్పూర్ సీతారాం పల్లిలో నివసిస్తున్న వృద్ధ దంపతులైన కట్టికల పర్వతాలు – పోచమ్మ కుటుంబానికి ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. తన్నీరు మావిన గారి పుట్టినరోజు సందర్భంగా ఈ సేవా కార్యక్రమం చేపట్టారు.
ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ అజీమొద్దీన్ మాట్లాడుతూ, వృద్ధులైన పర్వతాలు – పోచమ్మ దంపతుల ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉందని, స్థానికుల విజ్ఞప్తి మేరకు తాము స్పందించి ఈ సహాయం అందిస్తున్నామని తెలిపారు.
ఇప్పటికే ఒకసారి ఈ కుటుంబానికి సహాయం అందించామని, భవిష్యత్తులో కూడా అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి సహకరించిన తన్నీరు మావిన గారికి, తన్నీరు మధుకర్ అన్న గారికి, వారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు పెద్దపల్లి సాగర్, సుద్దాల అరుణ్ దేవ్, మావరపు సాయి రాజు తదితరులు పాల్గొన్నారు. నిరుపేదలకు సహాయం అందించడం తమ సంస్థ లక్ష్యమని వారు తెలిపారు.












