మంచేరియల్, 2026-07-31
రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ స్పీకర్ శ్రీ దుద్దిళ్ల శ్రీపాదరావు గారి సహోదరి, రాష్ట్ర ఐటీ & పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారి మేనత్త అయిన శ్రీమతి సువర్ణ వనమాల గారి దశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ స్పీకర్ స్వర్గీయ శ్రీ దుద్దిళ్ల శ్రీపాదరావు గారి సహోదరి, రాష్ట్ర ఐటీ & పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారి మేనత్త అయిన శ్రీమతి సువర్ణ వనమాల గారి దశదిన కర్మ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, సువర్ణ వనమాల గారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.




