మంచేరియల్, 2026-07-20
హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మంచిర్యాల నియోజకవర్గ నిరుపేద కుటుంబానికి ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అండగా నిలిచారు. ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా రూ. 1,00,000/- విలువైన LOCని వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.
మంచిర్యాల నియోజకవర్గ పరిధిలోని 32వ డివిజన్ కు చెందిన చందలూరి కుమార్ అనారోగ్యంతో హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన కుటుంబానికి అండగా నిలిచిన మంచిర్యాల ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) క్రింద రూ. 1,00,000/- విలువైన LOCని వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, టీపీసీసీ సభ్యులు, నస్పూర్ పట్టణ ఇంఛార్జి నూకల రమేష్ కూడా పాల్గొన్నారు.











