హజీపూర్, 2026-11-28
హాజీపూర్ మండలంలోని దొనబండ గ్రామంలో మహిళా సంఘాల కార్యకలాపాల నిర్వహణ కోసం నిర్మించనున్న భవన నిర్మాణానికి మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, అదనపు కలెక్టర్ చంద్రయ్య, కిషన్ లతో కలిసి భూమి పూజ నిర్వహించి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. గ్రామీణ మహిళల ఆత్మగౌరవానికి ఈ భవనాలు అండగా నిలుస్తాయని తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం మహిళా సాధికారతకు, గ్రామీణ మహిళల ఆర్థిక అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని తెలిపారు. మహిళా సంఘాలు మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.
భవనం నిర్మాణం పూర్తయితే మహిళా సంఘాల సమావేశాలు, పొదుపు కార్యక్రమాలు, వివిధ శిక్షణా కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని, మహిళలు సంఘటితంగా ముందుకు సాగుతూ ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు ఈ భవనం ఒక వేదికగా నిలుస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో హజీపూర్ సుమన్, పుష్పలత, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, మంచిర్యాల సింగిల్ విండో చైర్మన్ రాజేశ్వరరావు, హజీపూర్ మండల అధ్యక్షులు, సింగిల్ విండో చైర్మన్ తోట రవి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జాలే రాయలింగు, స్థానిక సర్పంచ్ బేతు రమాదేవి, నాయకులు తనుగుల సత్యం గౌడ్, రేవెల్లి ప్రసాద్, గూడ అంజి, కోట నవీన్ గౌడ్, జాడి విజయ్, సర్పంచ్లు, వార్డు మెంబర్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, సింగిల్ విండో డైరెక్టర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.







