మంచేరియల్, 13 September
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 48వ డివిజన్ వడ్డెర కాలనీకి చెందిన మున్సిపల్ కార్మికురాలు దివంగత వేముల అక్కమ్మ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మంతెన జగన్ మోహన్ రావు ఆర్థిక సాయం అందించారు. అక్కమ్మ దశదిన కర్మ ఖర్చుల నిమిత్తం రూ. 5,000/-లను ఆమె కుమారుడు వేముల రాజబాబుకు అందజేశారు.
మున్సిపల్ కార్మికురాలు అక్కమ్మ కుటుంబానికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు మంతెన జగన్ మోహన్ రావు ఆర్థిక ఊరట మంచిర్యాల: మంచిర్యాల మున్సిపల్ కార్పిరేషన్ పరిధిలోని 48వ డివిజన్ వడ్డెర కాలనీకి చెందిన మున్సిపల్ కార్మికురాలు దివంగత వేముల అక్కమ్మ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ మంతెన జగన్ మోహన్ రావు గారు ఆర్థిక సాయం అందించి తమ ఉదారతను చాటుకున్నారు. ఇటీవల అనారోగ్యంతో అక్కమ్మ అకాల మరణం చెందిన విషయం తెలుసుకున్న ఆయన, బాధితుల ఇంటికి వెళ్ళి వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా అక్కమ్మ దశదిన కర్మ ఖర్చుల నిమిత్తం రూ. 5,000/- ల ఆర్థిక సహాయాన్ని ఆమె కుమారుడు వేముల రాజబాబుకు స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా మంతెన జగన్ మోహన్ రావు మాట్లాడుతూ... నిత్యం ప్రజారోగ్యం కోసం కష్టపడే మున్సిపల్ కార్మికుల సేవలు వెలకట్టలేనివని, అక్కమ్మ మృతి చెందడం ఎంతో విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె కుటుంబానికి తమ గాఢ సానుభూతిని తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో కూడా ఆ కుటుంబానికి తోడుగా ఉంటామని హామీ ఇచ్చారు.










