మంచేరియల్, 2026-06-30
మంచిర్యాల నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతున్న K. శ్రీనివాస్ అనే పేదవాడికి మంచిర్యాల ఎమ్మెల్యే సాగరన్న అండగా నిలిచారు. ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా రూ. 2,50,000/- విలువైన LOCని అందజేశారు.
మంచిర్యాల నియోజకవర్గంలో పేద కుటుంబానికి మంచిర్యాల ఎమ్మెల్యే సాగరన్న అండగా నిలిచారు. అనారోగ్యంతో హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 58వ డివిజన్ కు చెందిన K. శ్రీనివాస్ కు ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) క్రింద చికిత్స నిమిత్తం రూ. 2,50,000/- విలువైన LOCని వారి కుటుంబ సభ్యులకు మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ శ్రీమతి శ్రీ సురేఖ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు అందజేశారు.












