మంచేరియల్, 8 September
గణేష్ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో, లక్షెట్టిపేటలో డీజే నిర్వాహకులకు పోలీసులు బైండోవర్ చేశారు. వినాయక మండపాలు, శోభాయాత్రల్లో డీజేలకు అనుమతి లేదని, భక్తిశ్రద్ధలతో, శాంతియుత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని సూచించారు.
*పత్రికా ప్రకటన* *డీజే నిర్వాహకుల బైండోవర్* గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా లక్షెట్టిపేటకు చెందిన పలువురు డిజే నిర్వాహకులను తాసిల్దార్ ముందు బైండోవర్ చేయడం జరిగింది. గణేష్ నవరాత్రుల సందర్భంగా వినాయక మండపాల వద్ద ఎలాంటి డీజేలకు అనుమతి లేదని శోభాయాత్రలో కూడా డీజేలు పెట్టకూడదని భక్తి శ్రద్ధలతో శాంతియుత వాతావరణం లో గణేష్ పండుగను జరుపుకోవాలని పోలీసులు సూచించారు. గణేష్ మండప నిర్వాహకులు పోలీస్ పోర్టల్ లో పూర్తి వివరాలు పొందుపరచాలన్నారు. మండపాల వద్ద సినిమా పాటలు పెట్టడం, జూదం ఆడటం లాంటివి చేయకూడదని ముఖ్యంగా భారీ సౌండ్ వచ్చే బాక్స్ ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదని పోలీసులు సూచించారు. డీజే నిర్వాహకులు నిబంధనలు ఉల్లంఘించి డీజేలు పెట్టిన శోభాయాత్రలు డీజెలు పెట్టిన శాఖపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది... *ఇట్లు* *గోపతి సురేష్* *ఎస్ ఐ లక్షెట్టిపేట*












