ఈ రోజు భీమారం మండల కేంద్రంలో *తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం* వ్యవస్థాపకులు *కామ్రేడ్ కాల్వ నరసయ్య యాదవ్* గారి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
సంఘం రాష్ట్ర అధ్యక్షులు *డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్* కామ్రేడ్ కాల్వ నరసయ్య యాదవ్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ, "గొర్రెల మేకల కాపరుల హక్కుల కోసం, బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవం కోసం కామ్రేడ్ కాల్వ నరసన్న చేసిన పోరాటం, త్యాగం మనందరికీ ఆదర్శం."
డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్, కామ్రేడ్ కాల్వ నరసయ్య యాదవ్ ఆశయాల సాధన కోసం కృషి చేయాలని, గొర్రెల మేకల కాపరుల సంక్షేమం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మెండే మల్లేష్ యాదవ్, మండల గౌరవ అధ్యక్షులు వేల్పుల పర్వతాలు యాదవ్, ప్రధాన కార్యదర్శి కేశవేణి సత్యనారాయణ యాదవ్, ఉపాధ్యక్షులు దారవేని తిరుపతి యాదవ్, శ్రీనివాస్ యాదవ్, గాదె తిరుపతి యాదవ్, ఎల్ఐసి జనరల్ మేనేజర్ రేష వేణి, శ్రీనివాస్ యాదవ్, కొక్కుల నరేష్, సముద్రాల బాలమల్లు, రాజన్న తదితరులు పాల్గొన్నారు.












