బెల్లంపల్లి ఏరియా నుండి ఎస్టిపిపికి బదిలీపై వచ్చిన డిప్యూటి పర్సనల్ మేనేజర్ శ్రీ ఎస్ వి రాజేశ్వర్ రావు గారు ఎస్టిపిపి ఇంచార్జ్ జిఎం శ్రీ మదన్ మోహన్ గారిని కలుసుకున్నారు.
ఈ సమావేశంలో జిఎం శ్రీ మదన్ మోహన్ గారు వారికి పుష్పగుచ్చం అందించి ఆహ్వానించారు. అనంతరం, శ్రీ ఎస్ వి రాజేశ్వర్ రావు గారు ఎస్టిపిపి ఈడి శ్రీ సిహెచ్ చిరంజీవి గారిని మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు.
పర్సనల్ డిపార్ట్మెంట్ విభాగధిపతిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా, పర్సనల్ డిపార్ట్మెంట్ సిబ్బంది వారికి పుష్పగుచ్చం అందించి, శాలువాతో ఘనంగా సన్మానించారు.
వివిధ విభాగాల అధికారులు, ఉద్యోగులు మరియు సిబ్బంది శ్రీ ఎస్ వి రాజేశ్వర్ రావు గారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పర్సనల్ ఆఫీసర్ శ్రీ ఠాకూర్ మోహన్ సింగ్, సీనియర్ అసిస్టెంట్ లు శ్రీనిధి, అరుణ, శశిధర్, సీనియర్ సెక్యూరిటీ గార్డ్ గోపాల్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.












