Mancherial/Jaipur (ప్రజావార్త) జూలై 17
ఇందారం ఎస్.సి. కాలనీ మెయిన్ రోడ్డు వద్ద వర్షాకాలంలో ఇళ్ల ముందు నీరు నిలిచి ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన సర్పంచ్ మహమ్మద్ ఫయాజ్, ఉపసర్పంచ్ ఎల్కటూరి శివ వెంటనే స్పందించారు. మురుగునీటి నిల్వ సమస్యను పరిష్కరించి, పిల్లల భద్రత కోసం స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయించారు.
ఇందారం ఎస్.సి. కాలనీ మెయిన్ రోడ్డు వద్ద వర్షాకాలంలో ఇళ్ల ముందు నీరు నిలిచి వాహనదారులు, కాలనీ వాసులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సమాచారం అందిన వెంటనే స్పందించిన ఇందారం గ్రామ సర్పంచ్ మహమ్మద్ ఫయాజ్, ఉపసర్పంచ్ ఎల్కటూరి శివ, జేసీబీ సహాయంతో రోడ్డును కట్ చేయించి, మురికి నీరు నిలువకుండా ఐరన్ పైపు వేయించారు.
అలాగే, కొద్ది దూరం ముందుకు రెండు ప్రైవేట్ పాఠశాలల వద్ద చిన్నపిల్లలు స్కూల్‌కు వెళ్లేటప్పుడు వాహనాల వల్ల ప్రమాదాలు జరగకుండా రెండు స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయించారు.
ఈ పనుల పట్ల కాలనీ వాసులు, ప్రజలు, పిల్లల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. సర్పంచ్, ఉపసర్పంచ్‌తో పాటు గ్రామ కార్యదర్శి ప్రశాంత్, కారోబార్ బషీర్, పారిశుధ్య సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు మాడుగుల శంకర్, యువనాయకులు చిప్పకుర్తి సతీష్ పాల్గొన్నారు.










