మంచేరియల్, 2026-07-17
శ్రీరాంపూర్, నస్పూర్ టౌన్ ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులు చెల్ల విక్రమ్, అధ్యక్షులు ఆధ్వర్యంలో, ఇటీవల మరణించిన ఆటో కార్మికుడు కేడం హరీష్ కుటుంబానికి రూ. 5000/- ఆర్థిక సహాయం అందించారు. జగిత్యాల్ జిల్లా, ఎండపెల్లి మండలం, అంబార్ పేట్ గ్రామంలోని వారి స్వగృహంలో ఈ సహాయాన్ని అందజేశారు.
శ్రీరాంపూర్, నస్పూర్ టౌన్ ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులు చెల్ల విక్రమ్, అధ్యక్షులు ఆధ్వర్యంలో ఆటో కార్మిక సోదరుడు కేడం హరీష్ గారి దశదిన కారిక్రమానికి వారి స్వగృహం జగిత్యాల్ జిల్లా, ఎండపెల్లి మండలం, అంబార్ పేట్ గ్రామానికి వెళ్లి, కేడం హరీష్ గారి చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు.
కుటుంబ సభ్యులను పరామర్శించి, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ శ్రీరాంపూర్ ఆటో యూనియన్ అండగా ఉంటుందని మనోధైర్యం కల్పించారు. అనంతరం, శ్రీరాంపూర్ ఆటో యూనియన్ తరుపున, చెల్ల విక్రమ్ (నస్పూర్ టౌన్ ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులు & శ్రీరాంపూర్ అధ్యక్షులు) చేతుల మీదుగా రూ. 5000/- (ఐదు వేల రూపాయలు) ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ కార్యక్రమంలో బానోత్ రాజ్, తిప్పని రవి, ఎండి సర్ధామ్, నడిగోటి రాజకుమార్, చిప్పకుర్తి తిరుపతి, పసునూటి రాజు, దుర్గం శ్రీనివాస్, సుంకే శేఖర్, వడ్లకొండ సాయి కుమార్, పస్ల పవన్, తదితరులు పాల్గొన్నారు.












