అనారోగ్యంతో కరీంనగర్‌లోని మెడికవర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న తహసిల్దార్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ శ్రీమతి అక్కల స్వప్నను టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షులు శ్రీ మారం జగదీశ్వర్ పరామర్శించారు. ఉద్యోగుల ఆరోగ్య పథకం () అమలు తీరును ఆయన పరిశీలించారు.
తహసిల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న శ్రీమతి అక్కల స్వప్న అనారోగ్య కారణాలతో కరీంనగర్‌లోని మెడికవర్ హాస్పిటల్లో చేరారు. ఆమెకు కింద చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో, టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షులు శ్రీ మారం జగదీశ్వర్ స్వప్నను పరామర్శించి, ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా, ఉద్యోగులకు సంబంధించిన పథకం సక్రమంగా అమలవుతుందా లేదా అనే దానిపై శ్రీ జగదీశ్వర్ ఆసుపత్రిలో పరిశీలన చేశారు. మెడికవర్ హాస్పిటల్లో 100 సమర్థవంతంగా అమలు జరుగుతోందని స్వప్న గారు తెలిపారు. టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షులు శ్రీ మారం జగదీశ్వర్‌తో పాటు టీఎన్జీవో కరీంనగర్ జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి, తదితరులు ఈ పరామర్శలో పాల్గొన్నారు. ఈ విషయంపై టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు శ్రీ గడియారం శ్రీహరి మాట్లాడుతూ, తహసిల్దార్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ స్వప్నను కేంద్ర సంఘం అధ్యక్షులు పరామర్శించినందుకు జిల్లా కమిటీ తరపున కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలోని ఉద్యోగులందరూ పథకం ద్వారా కరీంనగర్‌లోని మెడికవర్, రేనే హాస్పిటల్స్‌లో 100 ప్రయోజనం పొందుతున్నారని, కాబట్టి అందరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.












