మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మార్వాడి మహిళా మండలి ఆధ్వర్యంలో ఉమంగ్ మేళా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు హాజరై, మేళాను ప్రారంభించారు.
వెంకటేశ్వర్లు థియేటర్ వద్ద గల ఖండేల్వాల్ భవన్ లో ఏర్పాటు చేసిన ఈ ఉమంగ్ మేళా కార్యక్రమానికి సురేఖ ముఖ్య అతిథిగా విచ్చేసి, జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమెను మార్వాడి మహిళా మండలి సభ్యులు శాలువాతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో పట్టణ మహిళా అధ్యక్షురాలు గజ్జల హేమలత, పట్టణ కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ, 58వ డివిజన్ ఇంఛార్జి సరిత ఓజా, మరియు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా మండలి సభ్యులు పాల్గొన్నారు.
ఈ మేళా ద్వారా మహిళలకు వివిధ రకాల వస్తువులను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు, సామాజిక కార్యక్రమాలను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు.












