నస్పూర్, 2026-08-17
జిల్లాలో ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గుముఖం పట్టే అవకాశం, భూగర్భ జలమట్టాలు పడిపోతున్న నేపథ్యంలో రైతులు నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. వరి సాగుకు బదులుగా తక్కువ నీటితో పండించే ఆరుతడి పంటలను ఎంచుకోవాలని ఆయన రైతులకు పిలుపునిచ్చారు.
రైతులు నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నీటిపారుదల శాఖ ఎస్.ఈ. విష్ణు ప్రసాద్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సురేఖలతో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎల్‌నినో ప్రభావంతో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం, భూగర్భ జలమట్టాలు తగ్గిపోవడం వంటి పరిస్థితుల నేపథ్యంలో రైతులు పంటల వైవిధ్యీకరణపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.
ముందస్తు జాగ్రత్తలు
ప్రస్తుత ఖరీఫ్‌తో పాటు రానున్న రబీ సీజన్లోనూ నీటి లభ్యత విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నందున రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రస్తుతం ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో అందుబాటులో ఉన్న నీటిని మొదటి ప్రాధాన్యతగా త్రాగునీటి అవసరాలకు వినియోగించాల్సిన పరిస్థితి ఉందని, గొల్లవాగు ప్రాజెక్టుతో పాటు ఇతర ప్రాజెక్టులలోనూ వరి సాగుకు అవసరమైన స్థాయిలో నీరు అందుబాటులో ఉండే అవకాశం లేదని తెలిపారు.
వరికి ప్రత్యామ్నాయాలు
వరి పంటకు ఒక ఎకరాకు అవసరమయ్యే నీటితో సమానమయ్యే నీటిని వినియోగించి సుమారు 3 నుంచి 4 ఎకరాలలో ఆరు తడి పంటలను సాగు చేయవచ్చని కలెక్టర్ వివరించారు. ప్రస్తుత పరిస్థితులలో రైతులు వరి నాట్లు వేస్తే పంటకు అవసరమైన నీరు పూర్తిస్థాయిలో అందకపోవడంతో పంట ఎండిపోయే ప్రమాదం, దిగుబడి తగ్గడం, ధాన్యం నాణ్యత దెబ్బతినడం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. నీటి కొరత కారణంగా వరి గింజ పరిమాణం తగ్గి, దిగుబడి తగ్గడంతో పాటు పంటను మార్కెట్లో విక్రయించడంలోనూ రైతులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయని తెలిపారు.
తక్కువ నీటితో సాగు
ఈ నేపథ్యంలో మొక్కజొన్న, కంది, పెసలు, మినుములు, అలసందులు వంటి తక్కువ నీటితో సాగు చేయగల పంటలను రైతులు ఎంచుకోవాలని, ఈ పంటలకు అవసరమైన మేరకు నీటిని అందించగలిగే అవకాశం ఉన్నందున పంటలు విజయవంతంగా సాగయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని కలెక్టర్ తెలిపారు. పప్పుధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు రైతులకు అవసరమైన విత్తనాలను కూడా అందించే చర్యలు చేపడుతున్నామని తెలిపారు. మొక్కజొన్న, కంది, పెసలు, మినుములు తదితర పంటలకు ప్రభుత్వం కనీస మద్దతు ధర కల్పిస్తోందని, మొక్కజొన్నకు బహిరంగ మార్కెట్లో గరిష్ట మద్దతు ధర కంటే ఎక్కువ ధర లభిస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
అవగాహన కార్యక్రమాలు












