మంచేరియల్, 27.06.2026
రైతులను మోసం చేస్తూ నకిలీ పత్తి విత్తనాలను విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను మందమర్రి పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 100 కిలోల నకిలీ విత్తనాలతో పాటు రెండు బైకులను స్వాధీనం చేసుకున్నారు.
రైతులను మోసం చేస్తూ లాభాలు గడించడమే ధ్యేయంగా నకిలీ పత్తి విత్తనాలను విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను మందమర్రి పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా జరిపిన తనిఖీల్లో పట్టుకున్నారు. నిందితుల నుండి సుమారు 100 కిలోల నకిలీ పత్తి విత్తనాలతో పాటు, రవాణాకు ఉపయోగించిన రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
మందమర్రి ఎస్ఐ నరేష్ తెలిపిన వివరాల ప్రకారం, మందమర్రి మండల వ్యవసాయ అధికారి కిరణ్మయి, సిబ్బంది, మందమర్రి పోలీసులు కలిసి శనివారం ఉదయం 08:30 గంటల ప్రాంతంలో NH-363, అందుగులపేట్ శ్రీ కన్వెన్షన్ హాల్ సమీపంలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో అనుమానాస్పదంగా రెండు బైక్‌లపై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులను ఆపి విచారించగా నకిలీ విత్తనాల గుట్టు రట్టయింది.
మాకినేని రాఘవేంద్ర (39), నివాసం: మధుర నగర్, పాత మంచిర్యాల. కట్ట నరేష్ (41), నివాసం: బురదగూడెం, మందమర్రి. పుట్టగంటి పవన్ కుమార్ (39), నివాసం: బురదగూడెం, మందమర్రి.
నకిలీ పత్తి విత్తనాలు: ఎటువంటి సర్టిఫైడ్ లేబుల్స్, బిల్లులు లేని 100 కిలోల లూజ్ పత్తి విత్తనాలు. ద్విచక్ర వాహనాలు: అపాచీ బైక్ మరియు టీవీఎస్ బైక్.
అమాయక రైతులను నకిలీ విత్తనాలతో ముంచే ఇలాంటి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు హెచ్చరించారు. రైతులకు నష్టం చేకూరుస్తూ, అక్రమంగా నకిలీ విత్తనాలను రవాణా చేస్తున్న ముఠాను చాకచక్యంగా పట్టుకున్న మందమర్రి ఎస్ఐ నరేష్, పోలీస్ కానిస్టేబుళ్లు శ్రీనివాస్, రాకేష్, చైతన్య, మహేందర్, సంతోష్‌లను ఉన్నతాధికారులు హృదయపూర్వకంగా అభినందించారు.












