పెద్దపల్లి, 2026-08-01
పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద సాగర్ ఎల్లంపల్లి ప్రాజెక్టును శనివారం సాయంత్రం రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు సందర్శించారు. గోదావరి వరద ఉధృతిని పరిశీలించి, అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు.
పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద సాగర్ ఎల్లంపల్లి ప్రాజెక్టును శనివారం సాయంత్రం పలువురు మంత్రులు, శాసనసభ్యులు, నాయకులు సందర్శించారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వివేక్ వెంకటస్వామి, ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణ రావు, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఈ పర్యటనలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎల్లంపల్లి ప్రాజెక్టులో గోదావరి వరద ఉధృతిని పరిశీలించి, నీటి ప్రవాహం, ప్రస్తుత పరిస్థితులపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
అనంతరం గోదావరి తల్లికి చీర, సారె, పసుపు, కుంకుమలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రులకు ఎమ్మెల్యేలు, జిల్లా నాయకులు స్వాగతం పలికారు.











