మహిళల భద్రతను మరింత పెంచేందుకు మంచిర్యాల జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేకంగా షీ టీంను ఏర్పాటు చేసింది.
మంచిర్యాల డీసీపీ ఎ.భాస్కర్ మాట్లాడుతూ, లక్షెట్టిపేట పట్టణంలోని ఎల్కే గార్డెన్లో జరిగిన వార్డు సభలో మహిళల భద్రత కోసం ఈ టీమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, సేవలు, స్థానిక సమస్యలను తెలుసుకునేందుకు ప్రతి వారం వివిధ శాఖల అధికారులను క్షేత్రస్థాయికి పంపిస్తున్నామని ఆయన వివరించారు.
అత్యవసర పరిస్థితుల్లో 100 నంబర్‌కు కాల్ చేయాలని, కాల్ వచ్చిన ఐదు నిమిషాల్లో పోలీసులు స్పందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని డీసీపీ తెలిపారు.
మత్తు పదార్థాల వినియోగం గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ, గంజాయి సంబంధిత కేసుల్లో 70 మందిపై చర్యలు తీసుకున్నట్లు ఆయన చెప్పారు.












