మంచేరియల్, 2026-07-24
మంచిర్యాల - హైదరాబాద్ మధ్య నూతన జాతీయ రహదారి నిర్మాణం చేపట్టాలని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ గారిని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి గారు కోరారు. ఈరోజు ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి వినతి పత్రం అందజేసిన ఆయన, పలు కీలక అంశాలను వివరించారు.
మంచిర్యాల - హైదరాబాద్ మధ్య నూతన జాతీయ రహదారి నిర్మాణం చేపట్టాలని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ గారిని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి గారు కోరారు.
ఈరోజు ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి వినతి పత్రం అందజేసిన ఆయన, మంచిర్యాల - కరీంనగర్ - హైదరాబాద్ మధ్య నూతన జాతీయ రహదారి నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఉన్న రాజీవ్ రహదారిపై అధిక ట్రాఫిక్, నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రతిపాదన చేశారు.
నాగపూర్ - హైదరాబాద్ నూతన గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారిని మంచిర్యాల మీదుగా నిర్మిస్తే, హైదరాబాద్ చేరుకోవడానికి ప్రస్తుతం పట్టే 5 గంటల సమయం 3 గంటలలోపు తగ్గిపోతుందని రఘునాథ్ వెరబెల్లి తెలిపారు. నిత్యం వేలాది వాహనాలు విద్యా, వైద్య, ఇతర పనుల నిమిత్తం కరీంనగర్, హైదరాబాద్ వెళ్తున్నాయని, వారికి మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడానికి ఈ జాతీయ రహదారిని మంజూరు చేయాలని కోరారు.
అలాగే, ఈ రహదారి నిర్మాణం వలన సరుకు రవాణా కూడా వేగంగా జరుగుతుందని తెలిపారు. కావున వెంటనే జాతీయ రహదారిని మంజూరు చేసి పనులు ప్రారంభించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.












