ఓదెల, 2026-08-29
తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం, గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్‌రెడ్డి ఆదేశించడం పట్ల తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు గుండేటి ఐలయ్య యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. ఉద్యమకారులందరి తరఫున ఆయన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారుల సంక్షేమం, గుర్తింపు కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు గుండేటి ఐలయ్య యాదవ్, ఉద్యమకారులందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్‌రెడ్డి ఆదేశించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఉద్యమకారుల సంక్షేమం కోసం మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే శ్రీ చింతకుంట విజయ రమణారావు, రామగుండం ఎమ్మెల్యే శ్రీ మక్కన్ సింగ్, ఎంపీ శ్రీ వంశీకృష్ణ తదితరులు చేస్తున్న కృషికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
250 గజాల స్థలం, ఆసరా పెన్షన్, ఆరోగ్య కార్డులు, ఆర్టీసీ ఉచిత ప్రయాణం, గౌరవ గుర్తింపు వంటి ప్రధాన డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం ఉద్యమకారులకు భరోసా కలిగిస్తోందని ఆయన అన్నారు.
ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి, అర్హులైన ప్రతి ఉద్యమకారుడికి న్యాయం చేయాలని ఉద్యమకారుల తరఫున గుండేటి ఐలయ్య యాదవ్ ప్రభుత్వాన్ని కోరారు.











