మంచేరియల్, 2026-11-28
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో పనిచేస్తున్న 104 మంది నాన్-గెజిటెడ్ ఉద్యోగులు టీఎన్జీవో సభ్యత్వం స్వీకరించారు. టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది.
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో పనిచేస్తున్న 104 మంది మున్సిపల్ శాఖ నాన్-గెజిటెడ్ ఉద్యోగులు టీఎన్జీవో సభ్యత్వం తీసుకున్నారు. టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి మాట్లాడుతూ, ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో టీఎన్జీవో సంఘం ఎల్లవేళలా కృషి చేస్తుందని తెలిపారు. మంచిర్యాల జిల్లాలో సభ్యత్వ నమోదు చివరి దశలో ఉందని, అతి త్వరలోనే పూర్తి చేసి, రాష్ట్రంలోనే మంచిర్యాల జిల్లా మొదటి స్థానంలో నిలుస్తుందని, అదేవిధంగా రాష్ట్రంలోనే మంచిర్యాల జిల్లా ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో టీఎన్జీవో మంచిర్యాల జిల్లా కార్యదర్శి బొడ్డు శ్రావణ్, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షులు శ్రీపతి బాపురావు, ఉపాధ్యక్షులు జాడి రామ్ కుమార్, తంగళ్ళపల్లి తిరుపతి, మంచిర్యాల యూనిట్ అధ్యక్షులు నాగుల గోపాల్, మున్సిపల్ శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు.


