మంచిర్యాల నియోజకవర్గంలో, లక్షెట్టిపేట్ మండలం జెండా వెంకటాపూర్ గ్రామానికి చెందిన కె. మల్లేశం అనే వ్యక్తి ఆరోగ్య ఖర్చుల కోసం, మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు గారు రూ. 2,00,000/-లక్షల చెక్కును అందజేశారు.
ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు అండగా నిలవాలనే ఉద్దేశ్యంతో ఈ సహాయం అందించినట్లు తెలిపారు.
మల్లేశం కుటుంబ సభ్యులు ఈ సహాయాన్ని అందుకున్నారు. వారి ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఈ ఆర్థిక తోడ్పాటు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నారు.
ఈ సందర్భంగా శ్రీమతి సురేఖ రావు మాట్లాడుతూ, నియోజకవర్గంలోని అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం మరియు ప్రజాప్రతినిధుల తరపున సహాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.
ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో ఇలాంటి ఆర్థిక సహాయాలు ఎంతో మందికి ఊరటనిస్తాయని, ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని ఆమె పేర్కొన్నారు.











