మంచేరియల్, 2026-07-23
బీజేపీ మంచిర్యాల జిల్లా సీనియర్ నాయకుడు, మాజీ అధ్యక్షుడు శ్రీ ముల్కల్ల మల్లారెడ్డి గురువారం అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా సుదీర్ఘకాలం సేవలందించారు. ఆయన మృతిపై పార్టీ శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి.
బీజేపీ మంచిర్యాల జిల్లా సీనియర్ నాయకుడు, మాజీ అధ్యక్షుడు శ్రీ ముల్కల్ల మల్లారెడ్డి గురువారం కన్నుమూశారు. ఆయన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం సేవలు అందించారు. అలాగే రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులుగానూ బాధ్యతలు నిర్వర్తించారు.
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న ఆయన మృతి వార్త తెలిసి పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీ రఘునాథ్‌రావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీ వెంకటేశ్వర గౌడ్ తో పాటు పార్టీ శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మల్లారెడ్డి గారి సేవలను కొనియాడుతూ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.











