మంచిర్యాల అభివృద్ధిపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ చేసిన వ్యాఖ్యలకు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ స్పందించారు.
మంచిర్యాల అభివృద్ధిపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ చేసిన వ్యాఖ్యలకు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఘాటుగా స్పందించారు. కేంద్రంలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పెద్దపల్లి పార్లమెంట్ పరిధి, మంచిర్యాల జిల్లాకు ఏం చేసిందో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.
వంశీకృష్ణ మాట్లాడుతూ, "పదేళ్లు అధికారంలో ఉండి ఈ ప్రాంతానికి ఒక్క పెద్ద ప్రాజెక్టు అయినా తీసుకొచ్చారా? అభివృద్ధి గురించి మాట్లాడే ముందు మీ పనితీరు ఏమిటో ప్రజలకు వివరించండి" అని బీజేపీ నాయకులకు సవాల్ విసిరారు.
తాను చేస్తున్న కృషి ఫలితంగానే పలు అభివృద్ధి పనులు పురోగతి సాధిస్తున్నాయని స్పష్టం చేశారు. "కార్పొరేట్ కంపెనీలు నడపడం కాదు... మంచిర్యాల అభివృద్ధి కోసం ఎప్పుడైనా కేంద్ర మంత్రులను, అధికారులను కలిశారా?" అని ప్రశ్నించారు.
చివరగా, "సొల్లు కబుర్లు ఆపి అభివృద్ధిపై ఫోకస్ చేయండి.. ప్రజల సంక్షేమమే మా లక్ష్యం" అంటూ బీజేపీ నాయకులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.










