కార్మిక మరియు మైనింగ్ శాఖ మంత్రివర్యులు డా. జి. వివేక్ వెంకటస్వామి బుధవారం రోజున చెన్నూరు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొని, లబ్ధిదారులకు సహాయం అందిస్తారు.
29 ఏప్రిల్ 2026 నాడు మంత్రి డా. వివేక్ వెంకటస్వామి తన పర్యటనను ఉదయం 8:00 గంటలకు చెన్నూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి ప్రారంభించనున్నారు. ఇక్కడ కోటపల్లి మండలానికి చెందిన కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ పథకాల లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేస్తారు.
ఆ తర్వాత, ఉదయం 8:30 గంటలకు చెన్నూరు మండలం భావురావుపేట గ్రామానికి చేరుకుని, నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ మహోత్సవంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు గృహాలను అప్పగిస్తారు.
మంత్రి పర్యటనలో భాగంగా, ఉదయం 9:00 గంటలకు భీమారం లోని గీతా హైస్కూల్ రోడ్ లో వివాహ వేడుకకు హాజరవుతారు. లబడిపల్లి సర్పంచ్ మహేష్ నాయక్ మరియు లత గార్ల వివాహానికి విచ్చేసి, నూతన దంపతులను ఆశీర్వదిస్తారు.
చివరగా, ఉదయం 10:00 గంటలకు రామక్రిష్ణ పూర్ లోని ఠాగూర్ స్టేడియంలో జరుగుతున్న అస్మిత కేలో ఇండియా అండర్-16 బాలికల ఫుట్బాల్ ఛాంపియన్షిప్ లో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో భాగంగా విజేతలకు బహుమతులు అందజేస్తారు.












