మంచేరియల్, 2026-08-17
కళ్యాణ లక్ష్మి-షాదీ ముబారక్ పథకాలను నిలిపివేసే ప్రయత్నాలను నిరసిస్తూ మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్, మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు ఆదేశానుసారం ఈ నిరసన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను విస్మరించి, పథకాలను నిలిపివేయడంపై బిఆర్ఎస్ నేతలు తీవ్రంగా మండిపడ్డారు.
కళ్యాణ లక్ష్మి-షాదీ ముబారక్ పథకాలను నిలిపివేయడాన్ని నిరసిస్తూ మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పిలుపుమేరకు, మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు ఆదేశానుసారం ఈ నిరసన కార్యక్రమం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం పథకాన్ని నిలిపివేసే ప్రయత్నాలను నిరసిస్తూ, మంచిర్యాల కార్పొరేషన్ బిఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి విజిత్ కుమార్ ధర్నాలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నడిపెల్లి విజిత్ కుమార్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను మరిచి, కేవలం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, గతంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి-షాదీ ముబారక్ వంటి పథకాలను నిలిపివేయడానికి ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఈ పథకాలను యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. పథకాలు కొనసాగించకపోతే ప్రజల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడుతామని హెచ్చరించారు.
సెప్టెంబర్ 9న కళ్యాణ లక్ష్మి-షాదీ ముబారక్ పథకంపై నమోదైన పిటీషన్‌కు ప్రభుత్వం అప్పీల్ చేయని పక్షంలో, బిఆర్ఎస్ పార్టీ తరఫున కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి ఇండ్లను ముట్టడిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. అనంతరం మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, కల్యాణ లక్ష్మి-షాదీ ముబారక్ పథకంపై జరుగుతున్న నిరసనలను కలెక్టర్‌తో మాట్లాడి ప్రభుత్వానికి తెలియజేస్తానని హామీ ఇవ్వడంతో ధర్నా కార్యక్రమం ముగిసింది.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, మహిళా నాయకురాలు, నాయకులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన, విద్యార్థి విభాగ నాయకులు, బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.











