జైపూర్, 01.08.2026
జైపూర్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ)గా శ్రీ శ్రీపతి బాపూరావు సార్ గారు శుక్రవారం (01.08.2026) బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు పంచాయతీ కార్యదర్శులు, కార్యాలయ సిబ్బంది ఘనంగా సన్మానం చేశారు.
గౌరవ మండల పంచాయతీ అధికారి శ్రీ శ్రీపతి బాపూరావు సార్ గారు జైపూర్ ఇంచార్జ్ మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా జి. సత్యనారాయణ సార్ గారి నుండి శుక్రవారం (01.08.2026) పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జైపూర్ మండల పంచాయతీ కార్యదర్శులు మరియు మండల ప్రజా పరిషత్ కార్యాలయ సిబ్బంది ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. వారికి పూలమొక్కను అందించి, శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు ఏ సత్యనారాయణ, టి శ్రీనివాస్, పి సురేష్, బి శ్రావణ్ కుమార్, ఎస్ రాకేష్, బి వెంకటేష్, ఏం భాస్కర్, బి ఉదయ్ కుమార్, బి సురేందర్, ఏ రమాదేవి, డి తిరుమల, ఎస్ సుప్రియ పాల్గొన్నారు. అలాగే MPDO కార్యాలయ సిబ్బంది శ్రీమతి ఇంద్రావతి (సీనియర్ అసిస్టెంట్), ఐ తిరుపతి (జూనియర్ అసిస్టెంట్), మధుసూదన్ (టైపిస్ట్), కంప్యూటర్ ఆపరేటర్లు తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.











