మంచేరియల్, జులై 12
పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం ఎల్కలపల్లి గ్రామ పంచాయతీలో ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రత్యేక డెస్క్‌ను ఏర్పాటు చేశారు. గ్రామ సర్పంచ్ ఎరుకల అంజిబాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం ఎల్కలపల్లి గ్రామ పంచాయతీలో ఓటరు సవరణ ప్రక్రియలో భాగంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రత్యేక డెస్క్‌ను ఏర్పాటు చేసి ఓటరు నమోదు కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ ఎరుకల అంజిబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ అంజిబాబు మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరూ తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని, అలాగే అవసరమైన మార్పులు, చేర్పులు, తొలగింపులు చేసుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు.
గ్రామంలో ఓటరు నమోదు కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోందని నిర్వాహకులు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయాలని సర్పంచ్ ఎరుకల అంజిబాబు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ అంజిబాబు, బి.ఎల్.ఓ.లు, బి.ఎల్.ఏ.లు, పాలకవర్గం, ప్రజలు పాల్గొన్నారు.











