వరంగల్, 2026-06-05
నీలి కండువా కప్పుకొని మరొక దళిత నాయకుడిని విమర్శించడం సిగ్గుచేటని, కనీస అవగాహన లేకుండా మాట్లాడితే సహించేది లేదని బిఆర్ఎస్వి జిల్లా మాజీ అధ్యక్షుడు బడికెల శ్రవణ్, పార్టీ యువ నాయకులు కిరణ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పైడిమల్ల నర్సింగ్ ప్రవర్తనను, ఆయన చేసిన వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖండించారు.
ప్రశ్నించడం బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు ఇచ్చిన హక్కు. ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకోం. నీలి కండువా కప్పుకొని మరొక దళిత నాయకుడిని విమర్శించడం తీవ్రంగా సిగ్గుచేటని, కనీస అవగాహన లేకుండా మాట్లాడితే సహించేది లేదని బిఆర్ఎస్వి జిల్లా మాజీ అధ్యక్షుడు, పార్టీ యువ నాయకులు బడికెల శ్రవణ్, కిరణ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పైడిమల్ల నర్సింగ్ ప్రవర్తనను, ఆయన చేసిన వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖండించారు.
రాజా రమేష్ సేవా నిరతి
ఈ సందర్భంగా బడికెల శ్రవణ్ మాట్లాడుతూ, డాక్టర్ రాజా రమేష్ వైద్యుడిగా సింగరేణిలో విశిష్ట సేవలు అందిస్తూనే ప్రజాసేవపై ఉన్న మక్కువతో తన ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి వచ్చారని, ప్రజలందరి మన్ననలు పొందుతున్నారని కొనియాడారు.
నేర చరిత్రపై ధ్వజమెత్తు
అక్రమ దందాలు, భూ పంచాయతీలు చేస్తూ, అమాయక ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ రోజు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సంతకాలు చేసే వ్యక్తి డాక్టర్ రాజా రమేష్‌ను విమర్శించడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎద్దేవా చేశారు.
అనుచిత వ్యాఖ్యలపై హెచ్చరిక
తెల్ల బట్టల వెనుక ఉన్న నేర చరిత్ర ప్రజలందరికీ తెలుసని, ఇకపై డాక్టర్ రాజా రమేష్ గానీ, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ గానీ విమర్శిస్తే మర్యాద దక్కదని ఘాటుగా హెచ్చరించారు.
నైతికత మరవద్దు
అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా కల్పించిన ప్రశ్నించే హక్కును విచక్షణతో ఉపయోగించుకోవాలని, ఒక దళిత నాయకుడి హోదాలో ఉంటూ మరొక దళిత నాయకుడిని పిచ్చిపట్టినట్లు విమర్శించడం తగదని హితవు పలికారు.
పాల్గొన్నవారు
ఈ విలేకరుల సమావేశంలో యూత్ లీడర్లు, మాజీ కౌన్సిలర్లు జిలకర మహేష్, కిరణ్ కుమార్, జాడి మహేష్, కొండ కుమార్, శ్రీకాంత్, శివ, మణి, కంది క్రాంతి, సాయి దేవి, మణి కుమార్, స్వరూప తదితరులు పాల్గొన్నారు.











