మంచిర్యాల జిల్లా మండలంలోని ముత్తాపూర్ గ్రామానికి చెందిన సుమారు 30 మంది గ్రామస్తులు స్థానిక నాయకుడు రేణికుంట్ల ప్రవీణ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ చేరిక సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.
పార్టీలో చేరిన గ్రామస్తులకు రేణికుంట్ల ప్రవీణ్ కృతజ్ఞతలు తెలిపారు. గతంలో వివిధ పదవుల్లో పనిచేస్తూ ప్రజలకు సేవలు అందించానని, ఇకపై కూడా ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు ఎదురైనా తన దృష్టికి తీసుకువస్తే అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, అన్యాయాలను ప్రజలు గమనిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తిరిగి కేసీఆర్ను ముఖ్యమంత్రిని చేసే వరకు తన పోరాటం కొనసాగిస్తానని, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమానికి ఎండీ నాజర్ అధ్యక్షత వహించారు. ముత్తాపూర్ మాజీ సర్పంచులు చంద్రయ్య, తిరుపతి, మాజీ ఎంపిటిసి మంగయ్య తదితరుల సమక్షంలో గ్రామస్తులు పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో ఎదునూరి హరీష్, గుమ్మల పోషం, పోతురాజుల పోషం, పోతురాజుల వెంకటేష్, గుమ్మల చిలుకయ్య, లక్ష్మి, మర్మాల శివ, పోతురాజుల మల్లేష్, గుమ్మల వికాస్, సుంకరి అన్వేర్ చారి, మాచర్ల భీమేష్, పోతురాజుల అంజలి, పోతురాజుల స్వప్న, మాచర్ల మల్లక్క, బక్కోళ్ల శంకరయ్య, బక్కోళ్ల సాలక్క, కుమ్మల పద్మ, గుమ్మల మహేష్, గుమ్మల రాజేష్, గుమ్మల రోజా, రామగిరి శ్రీనివాస్, రామగిరి శంకరమ్మ తదితరులు ఉన్నారు.
పార్టీలో చేరిన గ్రామస్తులు మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని, రేణికుంట్ల ప్రవీణ్కు ఎల్లవేళలా అండగా ఉంటామని తెలిపారు. ప్రజలకు ఎదురయ్యే సమస్యల పరిష్కారంలో తమ వంతు సహకారం అందిస్తామని పేర్కొన్నారు.












